TG: ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామంజపూర్ గ్రామానికి చెందిన దొబ్బ నర్సింహ, వరలక్ష్మి దంపతులు కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. వీరి పెద్ద కొడుకు సుశాంత్ (18) సిద్ధాంతిలో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని సుశాంత్ చనిపోయాడు. సుశాంత్ ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే బాధలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లి తెలిపింది.