ప్రియురాలి మృతితో యువకుడి బలవన్మరణం

66చూసినవారు
ప్రియురాలి మృతితో యువకుడి బలవన్మరణం
AP: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి ప్రియుడి కోసం నెలకిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్న ప్రియుడు కూడా ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఆవులవాండ్లపల్లెకు చెందిన బాదుల్లా కుమారుడు షేక్ ఫరూఖ్ (27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అక్కడే ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఫరూఖ్‌తో పెళ్లికి యువతి కుటుంబీకులు ఒప్పుకోలేదు. దాంతో ఆ యువతి ఉరేసుకోగా.. తాజాగా ఫరూఖ్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :