ప్రియురాలికి పెళ్లి.. యువకుడు ఆత్మహత్య

24672చూసినవారు
ప్రియురాలికి పెళ్లి.. యువకుడు ఆత్మహత్య
AP: ప్రేమించిన అమ్మాయికి వివాహం అయ్యిందని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం (D) ఓబుళాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. ఓబుళాపురానికి చెందిన జయకృష్ణ(22) పొక్లెయిన్ డ్రైవరుగా పని చేస్తున్నాడు. తాను ప్రేమించిన యువతికి వివాహం కావడంతో మనోవేదనకు గురైయ్యాడు. తీవ్ర మనస్తాపానికి లోనైన జయకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్