పెళ్లి కావడంలేదని ఆవేదనతో యువకుడి ఆత్మహత్య

13088చూసినవారు
పెళ్లి కావడంలేదని ఆవేదనతో యువకుడి ఆత్మహత్య
TG: పెళ్లి కావడం లేదని ఆవేదనతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న బూర సురేందర్, రమ దంపతులు పెద్ద కుమారుడు నరేష్(32)కు గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. HYD అమీర్‌పేట్ ప్రాంతంలో ఒక బట్టల షాపులో పని చేస్తున్నందున పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని నరేష్ కొద్దిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.