TG: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో శేఖర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు మృతదేహంతో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.