TG: ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బాసర బ్రిడ్జి వద్ద జరిగింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రామావత్ సాయికిరణ్ (25) గత నెల UK నుండి స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఈనెల 5న యూకే వెళ్లాస్సి ఉండగా అంతలోనే విషాదం నెలకొంది.