AP: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో విషాద ఘటన జరిగింది. యూ. కొత్తపల్లి మండలం రమణక్కపేటలో రొయ్యల చెరువులో కూలీగా పనిచేస్తున్న ఎం. నూకరాజు (37) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.అతను ట్రాన్స్‌ఫార్మర్‌పై విగతజీవిగా ఉండిపోయాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, రైతు నాగేశ్వర రెడ్డి అతన్ని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కించి మరమ్మతు చేయించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.