TG: గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబ్ నగర్(D) హన్వాడ (M)లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేపూర్ గ్రామానికి చెందిన గండిటి రవి (35) ప్రతిరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పనికి వెళ్తుండేవాడు. గురువారం పనికి వెళ్లిన రవి మధ్యాహ్న సమయంలో ఓ ఫంక్షన్ హాల్‌లో తెలిసిన వారి పెళ్లిలో భోజనం చేస్తుండగా గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.