
మండే ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్లో దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో లస్సీ, సత్తూ షర్బత్, పానకం, మజ్జిగ వంటి సంప్రదాయ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటంతో పాటు శక్తి, ఖనిజాలు అందుతాయని తెలిపారు. దాహం వేసే వరకు వేచి ఉండకుండా తరచుగా నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని, ఇంట్లో తయారు చేసుకున్న సహజ పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.




