TG: ఓ యువకుడు జ్యూస్ తాగుతూ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) బుధవారం రాత్రి పాన్‌షాప్ ముందు జ్యూస్ తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు యువకునికి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని, గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.