బస్సును ఓవర్‌టేక్ చేయబోయి యువకుడు మృతి (వీడియో)

23చూసినవారు
ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 11 వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో బస్సును ఓవర్‌టేక్ చేయబోయి, ఒక యువకుడు SUV కారు, క్యాబ్, R1 స్పోర్ట్స్ బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అతి వేగంతో ఓవర్‌టేక్ చేయడమే ఈ విషాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్