విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటకు ఐదేళ్ల బాబు, 18 నెలల పాప ఉన్నారు. తల్లికి భర్త స్నేహితుడు కనిజం వంశీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో కలిసి విజయవాడలో సహజీవనం చేస్తున్న తల్లి, తన 18 నెలల పాపను గోడకేసి కొట్టడంతో ఆ పసికందు మృతి చెందింది. ఈ ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది.