ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం సమీపంలో మనీష్ సాహు అనే యువకుడు MBA విద్యార్థిని కృతికను కాల్చి చంపాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీరు కొత్తకాలం ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. వీరు లలిత్‌పూర్‌లోని ఒకే కాలనీ ఉంటున్నారని, కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.