ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో దేవ్‌గావ్ కొత్వాలీ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని పట్ల ఓ యువకుడు కొద్దిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, ఆ ధైర్యవంతురాలైన విద్యార్థిని భయపడకుండా నడిరోడ్డుపైనే ఆ ఆకతాయికి చెప్పులతో, చెంపదెబ్బలతో గట్టి బుద్ధి చెప్పింది. అయితే బాలిక చూపిన ఈ అసాధారణ ధైర్యం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.