TG: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా, రోడ్డుపైకి వరద చేరింది. ఈ క్రమంలో, 80 ఏళ్ల వృద్ధురాలు వరదను దాటుతుండగా, ఆమెకు సహాయం చేయడానికి వెళ్లిన 23 ఏళ్ల యువకుడు గుండె నరేష్ వరద ఉధృతిని అంచనా వేయలేక ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. NDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.