మద్యం మత్తులో చెరువులో నిద్రపోయి.. వరదలో చిక్కుకున్న యువకులు

10చూసినవారు
తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలో, ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో చెరువులో నిలిపిన జీపులోనే నిద్రపోయారు. అదే రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులో నీటిమట్టం పెరిగి, జీపు నీటిలో మునిగిపోయింది. యువకుల కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి, పొక్లెయిన్ సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్