
ఐక్యరాజ్యసమితి ఆమోదంతో మారనున్న ప్రపంచ పటం
ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ ప్రపంచ దేశాల వాస్తవ పరిమాణాలను మరింత కచ్చితంగా చూపించే కొత్త ప్రపంచ పటానికి మద్దతు తెలిపింది. 164 దేశాల మద్దతుతో ఆమోదం పొందిన ఈ తీర్మానం, శతాబ్దాలుగా కొనసాగుతున్న Mercator projection మ్యాప్లలోని పరిమాణ వక్రీకరణలను సరిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఆఫ్రికా వంటి ఖండాలు వాటి అసలు పరిమాణంలో కనిపించనున్నాయి. ఈ మార్పును కేవలం భౌగోళిక సవరణగా కాకుండా "కాగ్నిటివ్ జస్టిస్"గా పరిగణించాలని తీర్మానం పేర్కొంది.




