AP: ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో విషాద ఘటన జరిగింది. ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దేవిశెట్టి నవ్య(26) ఎంబీఏ పూర్తి చేసింది. పలు ఉద్యోగాలకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఆందోళనకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట (2 టౌన్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.