TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన((17) అనే యువతి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాదులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. కాగా, యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.