TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ PS పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీరప్ప గడ్డ ప్రాంతానికి చెందిన జంగా శిరీష (21) గత కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకుంటోంది. అయితే ఆ బాధ భరించలేక, శుక్రవారం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.