భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన 19 ఏళ్ల నవవధువు, పెళ్లై ఆరు నెలలు కూడా గడవకముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనోవేదనకు గురైన యువతి ఆదివారం పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది. తన కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమని తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణించిన యువతి మూడు నెలల గర్భవతి అని సమాచారం.