మూడు రోజులుగా తల్లి సమాధి వద్దే రోదిస్తున్న యువతి (వీడియో)

42చూసినవారు
కరీంనగర్‌లో ఓ యువతి మూడు రోజులుగా తన తల్లి సమాధి వద్దే ఉంటోంది. పగలూ రాత్రి తేడా లేకుండా కబరస్తాన్ స్మశానంలోనే ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం తల్లి మరణించగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకనే యువతి అక్కడ ఉంటోందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆమె వెళ్లడం లేదని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్