ఓయోలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. వెలుగులోకి కీలక విషయాలు

9చూసినవారు
TG: ఓయోలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత (23) తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి HYD​కు వచ్చి, సోమవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో గది తీసుకున్నారు. అర్ధరాత్రి యువతి స్పృహ కోల్పోయిందంటూ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి రవితేజ పరారయ్యాడు. కాగా ఓయో రూమ్‌లో పగిలిన బీర్, విస్కీ బాటిళ్లు, గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. నిఖిత తల వెనుక తీవ్ర గాయాలు, ముఖం, శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల రవితేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్