రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కబోయి ఓ యువతి అదుపుతప్పి పడిపోయారు. అక్కడే ఉన్న RPF సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు లాగి కాపాడారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జంక్షన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ పంచుకోగా వైరల్ అవుతోంది. కదులుతున్న రైలు ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. కాగా ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.