AP: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా, కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి (23) అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. US యూనివర్సిటీలో MS కంప్యూటర్స్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రాజ్యలక్ష్మి, 3 రోజుల క్రితం జలుబు, ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. గురువారం రాత్రి నిద్రించిన ఆమె, మరుసటి రోజు ఉదయం నిర్జీవంగా కనిపించింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.