బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో తాజాగా దారుణ ఘటన వెలుగుచూసింది. కర్పూరి గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూఢీ గండక్ డ్యామ్ బైపాస్ రోడ్డుపై పగటిపూటే కొందరు అకతాయిలు బైక్‌లపై వచ్చి ఓ యువతి, యువకుడిని చుట్టుముట్టారు. యువతి చేయి పట్టుకుని ఈడ్చుకెళ్తూ వేధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియో ఆధారంగా పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.