TG: మాదాపూర్‌లోని OYO హోటల్లో సెప్టెంబర్ 21న షారన్ నిఖిత (29) అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రియుడు శ్రీనివాస రవితేజ విచక్షణారహితంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విశాఖకు చెందిన నిఖిత, ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లింది. రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, రవితేజ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి నుంచి పారిపోయిన రవితేజ, స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసుకోగా, కోలుకున్నాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవిస్తుండగా పెళ్లి ప్రస్తావన రావడంతో గొడవ జరిగి, అది హింసాత్మకంగా మారి నిఖితను కొట్టినట్లు రవితేజ విచారణలో ఒప్పుకున్నాడు.