AP: విజయవ
ాడ ఇబ్రహీంపట్నం పరిధిలో యువతిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కూలింగ్ కెనాల్లో పడేసిన కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. మృతురాలు మంగళగిరికి చెందిన కళ్యాణిగా పోలీసులు గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా గుర్తింపు నిర్ధారించినట్లు తెలిపారు. కాళ్లు, చేతులు, మొండెం, తలను వేర్వేరు భాగాలుగా చేసి పడేసినట్లు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాలు, వివాహేతర సంబంధం కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణి చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎవరితో కలిసి నివసించిందనే వివరాలను సేకరిస్తున్నారు.