మంటల్లో చిక్కుకున్న కుక్కను కాపాడిన యువతి

57చూసినవారు
మంటల్లో చిక్కుకున్న కుక్కను కాపాడిన యువతి
విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక అయిన శునకం, యజమాని కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదు. ముంబైలోని మీరా రోడ్‌లో ఓ వేర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించగా, కట్టేసి ఉన్న ఓ కుక్క మంటల్లో చిక్కుకుంది. దాని అరుపులు విన్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఓ యువతి ధైర్యం చేసి, తన ప్రాణాలను పణంగా పెట్టి మంటల్లోకి వెళ్లి ఆ మూగజీవిని రక్షించింది. కుక్కకు గాయాలైనప్పటికీ, ఆమె చర్య స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆ యువతిని ప్రశంసిస్తూ, ఆమెకు అవార్డు ఇవ్వాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్