రాజస్థాన్‌లోని జైపూర్‌లో లిఫ్ట్ అడిగిన ఒక యువతి, బైక్ నడుపుతున్న యువకుడి ఫోన్ దొంగిలించింది. అతను గమనించి నిలదీయగా, ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను వేధిస్తున్నాడంటూ ఎదురు దాడికి దిగింది. కొన్ని ఏళ్ల క్రితం అయితే వాస్తవాలు తెలియకుండానే చాలా మంది అమ్మాయికి మద్దతుగా నిలిచి ఆ యువకుడిని కొడతారు. కానీ ఇప్పుడు ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.