TG: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ కౌంటరిచ్చారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని, ఆయన రాజీనామా చేస్తే ఢిల్లీనే వణికిందని అన్నారు. సోనియా గాంధీ భయంతోనే తెలంగాణ ఇచ్చారని,
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి మీ నాయకురాలికే లేదని, నీకుందా అని రేవంత్‌ను ప్రశ్నించారు. మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, ఇతర పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు.