
ఈ నెల 17 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు!
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఐదు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనుంది. సమావేశాల వ్యవధి, ఎజెండాపై 17న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిశ్రమలు-పెట్టుబడులు, మెగా డీఎస్సీ, విద్యుత్ ఛార్జీలు, భూ సంస్కరణలు, సంక్షేమం, నౌకాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.




