AP: విజయనగరం జిల్లాల్లోని బొబ్బిలిలో విషాద ఘటన జరిగింది. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాప
ురానికి చెందిన శంకరరావు, అప్పలనర్సమ్మ పెద్ద కుమారుడు మధు టెన్త్ లో ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యాడు. ఏడాది క్రితం స్టడీ పూర్తి కావడంతో కొన్నాళ్లు చెన్నై, హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.