TG:సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓయో లాడ్జిలో అఖిల్ (30) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో రూ.6 లక్షలు నష్టపోవడమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అయితే అఖిల్ చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడని, తండ్రి అక్కడకు చేరుకునే లోపే ఉరివేసుకున్నాడని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.