లాడ్జిలో యువకుడు ఆత్మహత్య (వీడియో)

51చూసినవారు
TG: లాడ్జిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకృష్ణ లాడ్జిలో రాజశేఖర్‌ (26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మస్తీపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎందుకు చనిపోయాడనేది తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :