విషాదం.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

7901చూసినవారు
విషాదం.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
TG: వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గణేశ్‌(20) అనే యువకుడు మృతి చెందాడు. మహమ్మదాబాద్‌ మండలం మంగంపేట్‌ గ్రామానికి చెందిన గణేశ్‌, తన బైక్‌పై కులకచర్ల నుండి స్వగ్రామానికి వెళ్తుండగా.. కులకచర్ల మండలం ఘనాపూర్‌ స్టేజ్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్