బోగీలోకి దూసుకొచ్చిన యువకులు.. టాయిలెట్‌లో లాక్‌ చేసుకున్న మహిళ (VIDEO)

0చూసినవారు
బిహార్‌లోని జయ్‌నగర్ నుంచి జానకి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు భయంతో టాయిలెట్‌లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంది. రైలు కతిహార్ జంక్షన్ వద్ద ఆగిన సమయంలో ఒక్కసారిగా 30–40 మంది యువకులు స్లీపర్ కోచ్‌లోకి దూసుకు వచ్చారు. వారు గట్టిగా అరవడంతో ఒంటరిగా ఉన్న మహిళ భయపడి టాయిలెట్‌లో దాక్కొని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది టికెట్ లేకుండా బోగీలోకి వచ్చిన వారిని దింపివేసి ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్