భారత్‌లో యూట్యూబ్ తన 'షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్'ను విస్తరించింది. క్రియేటర్ల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అమెజాన్, అజియో, మీషో, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలతో పాటు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ల ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలలో ట్యాగ్ చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. ఉత్పత్తుల వివరాలను వీక్షకులు నేరుగా వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా అడిగి తెలుసుకునేలా 'ఆస్క్ యూట్యూబ్ ఫర్ షాపింగ్' ఏఐ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.