బిహార్ ఎన్నికల్లో యూట్యూబర్ మనీశ్ కశ్యప్ చన్‌పటియా నుంచి పోటీ చేసి 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 96 లక్షల ఫాలోవర్లతో ప్రజాదరణ ఉన్నా రాజకీయ ప్రత్యర్థులను అధిగమించలేకపోయారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్, బీజేపీ అభ్యర్థిపై 37 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2023లో వలస కూలీలపై తప్పుడు వీడియోల కేసులో మనీశ్ అరెస్టై, తర్వాత భాజపాలో చేరి, అనంతరం జన్‌సురాజ్‌లో చేరి ఈ ఎన్నికల్లో బరిలో దిగారు.