సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

8చూసినవారు
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం
ప్రముఖ దర్శకుడు, లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. దక్షిణ భారత సినీ రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక ముద్ర వేశారని, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ చిరస్మరణీయం అని జగన్ పేర్కొన్నారు. ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ఉన్నతంగా నిలిపారని, మూస ధోరణులకు భిన్నంగా కొత్త కథలు, కొత్త సాంకేతికత, వినూత్నమైన ఆలోచనలతో తరతరాల సినీ ప్రేక్షకులను అలరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్