ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ.. “ఈ మైలురాయి దేశసేవ పట్ల మీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతకు ప్రతీక. మీరు ఇలాగే ప్రజల సేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.