
సౌతాఫ్రికా టెస్టుకు టికెట్లు సోల్డ్ ఔట్: సౌరవ్ గంగూలీ ధృవీకరణ
నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఇండియా, సౌతాఫ్రికా తొలి టెస్టుకు భారీ హైప్ నెలకొంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ కు టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టికెట్లు సోల్డ్ ఔట్ అయినట్టు ధృవీకరించారు. టికెట్ ధర కేవలం రూ. 60 మాత్రమే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ లో ఇండియా గెలిస్తే టాప్-2కు చేరుతుంది.




