AP: అనంతపురంలోని రుద్రంపేటలో ఆరేళ్ల బాలికపై ఓ
వైసీపీ నేత అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, గుండు కొట్టించి, ముఖానికి రంగు పూసి వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అయితే, పోలీసులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.