AP:
వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతిపై ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి చుండూరు రవిబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకుమాను రాజశేఖర్ అకాల మృతి కారణంగా ఈరోజు జరగాల్సిన ఎంపీపీ, జడ్పీటీసీల సన్మాన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు
వైసీపీ ప్రకాశం జిల్లా శ్రేణులు తెలిపాయి.