జెలెన్‌స్కీకి తప్పిన ప్రమాదం.. విమానానికి అతిసమీపంలో డ్రోన్‌ (VIDEO)

56చూసినవారు
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయల్దేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్‌ అవుతుండగా ఓ డ్రోన్‌ అత్యంత సమీపంలోకి వచ్చింది. కాస్త అటూఇటూ అయితే విమానాన్ని ఢీకొనేంత దగ్గరగా డ్రోన్‌ వచ్చినట్లు నార్వే ప్రధాని జోనాస్‌ స్టోర్‌ వెల్లడించారు. ఘటన అనంతరం జెలెన్‌స్కీ ప్రయాణాన్ని కొనసాగించగా, ఓస్లోలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అయితే డ్రోన్‌ ఎటువైపు నుంచి వచ్చిందనే వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్