బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమ ఆర్డర్ ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో ఇద్దరు వ్యక్తులు జొమాటో డెలివరీ ఏజెంట్‌పై దాడి చేశారు. ఆదివారం రాత్రి శోభా థియేటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఆలస్యం కావడంతో కస్టమర్లు డెలివరీ బాయ్‌తో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు వ్యక్తులు డెలివరీ బాయ్‌పై చేతుల్లో ఉన్న వస్తువులతో తీవ్రంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.