
స్కూల్ బస్సు టిప్పర్ ఢీ.. 13 మంది విద్యార్థులు మృతి
దక్షిణాఫ్రికాలోని వాల్ ప్రాంతంలోని వాండర్బిజల్పార్క్లో స్కూల్ బస్సు, టిప్పర్ ట్రక్కు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 13 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, స్కూల్ బస్సు డ్రైవర్ ప్రమాదకరమైన ఓవర్టేకింగ్ యుక్తికి ప్రయత్నించి, దూరాన్ని తప్పుగా అంచనా వేయడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.





























