
జెమీమా రోడ్రిగ్స్‌కు గాయం.. ఆసియా కప్ ఆడేనా?
ఇంగ్లండ్‌లో ‘ది హండ్రెడ్ లీగ్’ ఆడుతున్న భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఆగస్టు నెలాఖరులో జరగనున్న ఆసియా కప్‌లో ఆమె ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆగస్టు 28 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ షురూ కానుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. రూ.76 లక్షలకు సథర్న్ బ్రేవ్ జట్టు కొనుగోలు చేసిన జెమీమా, ఆరు మ్యాచ్‌లలో 143 పరుగులు చేసింది. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను తీసుకున్నారు.



































