
చిరంజీవి 'కాకా' నుంచి అదిరిపోయే కొత్త పోస్టర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా దీపావళి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానులను అలరిస్తోంది. పంట పొలంలో కొడవలితో చిరంజీవి రౌడీలను ఊచకోత కోస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్, సినిమాపై అంచనాలను పెంచింది. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.


































