
'ది ప్యారడైజ్' సినిమాపై రాజకీయ దుమారం (VIDEO)
'ది ప్యారడైజ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సినిమాలో KCR, సీనియర్ NTR పాత్రలు రాజకీయ చర్చకు దారితీశాయి. కేసీఆర్ పాత్రను ఉద్దేశించి BRS నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియదర్శి పోషించిన కేసీఆర్ పాత్ర పొగ తాగుతూ ఉండటాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్రపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సెన్సార్ ప్రక్రియలో కూడా రాజకీయ ప్రస్తావనలు, వివాదాస్పద డైలాగులు ఉన్నాయని, వాటిపై మార్పులు సూచించారని సమాచారం.



































